రోషన్ కనకాల రెండో సినిమా: మోగ్లీ!

ప్రముఖ యాంకర్ సుమ కుమారుడు రోషన్ కనకాల గత ఏడాది ‘బబుల్ గమ్’ అనే సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కానీ అది నిరాశపరిచింది. కనుక కొంచెం గ్యాప్ తీసుకొని ఇప్పుడు రెండో సినిమా చేసేందుకు సిద్దామయ్యాడు. కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించబోతున్న ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదల చేశారు. ఈ సినిమాకి ‘మోగ్లీ’ అని పేరు ఖరారు చేశారు. ఓ దట్టమైన అడవిలో చెట్ల మద్య మోగ్లీ (హీరో)ని చూపారు. కనుక ఇది అడవులలో సాహసయాత్ర కధ అయ్యుండవచ్చు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ భామ సాక్షి మడోల్కర్ హీరోయిన్‌గా నటించబోతోంది. హర్ష చెముడు ముఖ్య పాత్ర చేస్తున్నారు. ఈ సినిమాకు కాల భైరవ సంగీతం  అందించబోతున్నారు.