సినిమా నచ్చలేదా.. అయితే డబ్బులు వాపసు!

ఇప్పుడు సినిమా టికెట్ ధరలు ఆకశానంటుతున్నాయి. అదే పెద్ద సినిమాలు రిలీజ్ అయిన మొదటి రోజులు అయితే బాదుడే బాదుడు ఉంటుంది. అంత డబ్బు పెట్టి టికెట్ కొనుకున్నాక ఒకవేళ సినిమా నచ్చకపోతే, భరించాల్సిందే లేదా మద్యలో లేచి వెళ్ళిపోవచ్చు.

కానీ టికెట్ డబ్బులు వెనక్కు వస్తే? అంతకంటే ఆనందం ఏముంటుంది? హైదరాబాద్‌లో పీవీఆర్ ఐనాక్స్ థియేటర్‌లో ఈ కొత్త పధకం ప్రారంభం అయ్యింది.

ఎవరైనా సినిమా నచ్చక మద్యలో వెళ్ళిపోవాలనుకుంటే, అంతవరకు వారు చూసిన సినిమాకి ఛార్జీ మినహాయించుకొని మిగిలిన సొమ్ము వాపసు చేస్తామని పీవీఆర్ ఐనాక్స్ యాజమాన్యం చెప్పింది.

అయితే ఈ వెసులుబాటు కావాలనుకునే వారు ప్రీమియం మెంబర్ షిప్ తీసుకోవలసి ఉంటుందని తెలిపింది. ప్రీమియం మెంబర్ షిప్ కోసం రూ. 699 చెల్లించాల్సి ఉండగా దానిలో 10 శాతం చెల్లిస్తే చాలని తెలిపింది. అంటే రూ. 69లు చెల్లించాలన్న మాట!