ముఫాసా: ది లయన్ కింగ్ రేపే విడుదల

డిస్నీ నుంచి మరో అద్భుతమైన యానిమేషన్ మూవీ ముఫాసా: ది లయన్ కింగ్ రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.  1994లో విడుదలైన ‘ది లైన్ కింగ్’ సినిమాకి సీక్వెల్‌గా ఇది వస్తోంది.

దీని తెలుగు వెర్షన్‌లో ముఫాసా (సింహం) పాత్రకు మహేష్‌ బాబు డబ్బింగ్ చెప్పారు.  ప్రముఖ తెలుగు హాస్య నటులు బ్రహ్మానందం, అలీ, ఇంకా సత్యదేవ్, అయ్యప్ప పి శర్మ వివిద పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు.

ఈ సినిమా టీజర్‌, ట్రైలర్ రెండూ ఒకదానిని మించి మరొకటి అన్నట్లున్నాయి. ఇటీవల మహేష్ బాబు, లయన్ కింగ్ ముఫాసాలతో కూడిన ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అది కూడా అద్భుతంగా ఉంది. మహేష్ బాబు కుమార్తె సితార దానిపై స్పందిస్తూ ‘ముఫాసాలాగే మా నాన్నగారు కూడా మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకుంటారు,” అని అంది. 

దీని హిందీ వెర్షన్‌లో ముఫాసా పాత్రకి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారూక్ ఖాన్, ముఫసా చిన్నప్పటి పాత్రకి ఆయన చిన్న కుమారుడు అబ్రమ్, సింబా పాత్రకు పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు.

ఈ సినిమాకు దర్శకత్వం: బారీ జెన్‌కీన్స్, స్క్రీన్ ప్లే: జెఫ్ నాధన్‌సన్, బ్యాక్ గ్రౌండ్ సంగీతం: డావ్ మెట్జర్, పాటలకు సంగీతం: లిన్-మాన్యుయెల్ మిరండా, ఎడిటింగ్: జోయి మెక్ మిలన్. 

నిర్మాణ సంస్థ: వాల్ట్ డిస్నీ పిక్చర్స్; డిస్ట్రిబ్యూటర్ సంస్థ: వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్.