ఆ పుకార్లు నమ్మవద్దు: ప్రశాంత్ వర్మ

నందమూరి మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేస్తూ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా నిలిచిపోయిందని గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకి భారీ పారితోషికంతో పాటు సినిమా లాభాలలో వాటా ఇవ్వాలని ప్రశాంత్ వర్మ పట్టుబడుతుండటంతో అందుకు ఇష్టపడని బాలయ్య నాగ్ అశ్విన్‌కి కొడుకుని పరిచయం చేసే బాధ్యత అప్పగించారని ఆ వార్తల సారాంశం.

వీటిపై స్పందించిన ప్రశాంత్ ప్రశాంత్ వర్మ, అవన్నీ వట్టి పుకార్లే అని ఇటువంటి దుష్ప్రచారం చేయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మోక్షజ్ఞతో సినిమాకి సంబందించి సమాచారాన్ని ఎప్పటికప్పుడు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా తెలియజేస్తుంటామని కనుక ఈ పుకార్లను ఎవరూ నమ్మవద్దని ప్రశాంత్ వర్మ విజ్ఞప్తి చేశారు.  

అంటే ప్రశాంత్ ప్రశాంత్ వర్మ-మోక్షజ్ఞల ప్రాజెక్ట్ యధాతధంగా ఉందని స్పష్టమైంది కనుక త్వరలో ఈ సినిమాకి సంబందించి వివరాలు ప్రకటించే అవకాశం ఉంది.