
రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్లో ‘గేమ్ చేంజర్’ నుంచి నాలుగో పాట ప్రమో ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదలైంది. రామజోగయ్య వ్రాసిన ఈ పాటని తమన్ అద్భుతంగా స్వరపరచగా , రోషినీ, పృధ్వీ శ్రుతీ రంజనీలతో కూడా గొంతు కలిపి తమన్ అద్భుతంగా పాడారు. పూర్తి పాట డిసెంబర్ 21న విడుదల కాబోతోంది.
రామ్ చరణ్, కియరా అద్వానీ జంటగా నటిస్తున్న గేమ్ చేంజర్‌లో ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం, అంజలి తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ కలిసి పాన్ ఇండియా మూవీగా 5 భాషల్లో నిర్మిస్తున్నారు. గేమ్ చేంజర్ 2025, జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు విడుదల కాబోతోంది.