గేమ్ చేంజర్‌ నాలుగో పాట ప్రమో నేడే

రామ్ చరణ్‌-శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘గేమ్ చేంజర్‌’ నుంచి నాలుగో పాట డిసెంబర్‌ 21న విడుదల కాబోతోంది. ఆ పాట ప్రమో ఈరోజు సాయంత్రం 6.03 గంటలకు విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ, ఆ పాటలో రామ్ చరణ్‌-కియారా అద్వానీల పోస్టర్ విడుదల చేశారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఈ నాలుగో పాట ఏవిదంగా ఉంటుందో ఈరోజు సాయంత్రం రుచి తెలుస్తుంది. 

ఇంతవరకు ‘గేమ్ చేంజర్‌’ని రామ్ చరణ్‌-శంకర్ సినిమాగానే చూస్తూ ఎలా ఉంటుందో అని అందరూ అనుకునేవారు. కానీ పుష్ప-2 సూపర్ డూపర్ హిట్ అయిన తర్వాత, ముఖ్యంగా కలెక్షన్స్‌ సునామీ సృష్టిస్తున్నప్పుడు, ప్రతీ ఒక్కరూ పుష్ప-2ని గేమ్ చేంజర్‌ బీట్ చేయగలదా లేదా? బీట్ చేయలేకపోయినా ప్రేక్షకులను మెప్పించి సూపర్ హిట్ అయితే చాలని అభిమానులు అనుకునే పరిస్థితి నెలకొంది. 

ఈ సినిమాలో కియరా అద్వానీ హీరోయిన్‌గా నటించగా ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం, అంజలి తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. 

స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్‌.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేశారు. 

నిర్మాతలు దిల్‌రాజు, శిరీశ్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2025, జనవరి 10వ తేదీన సంక్రాంతి పండుగకు ముందు 5 భాషల్లో విడుదల కాబోతోంది.