
నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞని తెలుగు సినీ పరిశ్రమకి దర్శకుడు ప్రశాంత్ వర్మ పరిచయం చేస్తారనుకుంటే హటాత్తుగా ఆయన తప్పుకున్నారు. ఈ సినిమాకు భారీ పారితోషికంతో పాటు సినిమా లాభాలలో కూడా వాటా ఇవ్వాలని ప్రశాంత్ వర్మ పట్టుబట్టడంతో బాలకృష్ణ ఆయనతో సినిమా వద్దనుకున్నట్లు తాజా సమాచారం.
ఇప్పుడు మోక్షజ్ఞని హీరోగా పరిచయం చేసే బాధ్యతని కల్కిఏడీ 2898తో సూపర్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్‌కి బాలయ్య అప్పజెప్పిన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై అధికార ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మోక్షజ్ఞ మొదటి సినిమాకే ఇటువంటి అవాంతరం ఏర్పడి నిలిచిపోయినప్పటికీ బాలయ్య ‘అంతా మన మంచికే’ అని సరిపెట్టుకొని వెంటనే నాగ్ అశ్విన్ చేతిలో కొడుకుని పెట్టారు.
బాలకృష్ణ సూపర్ హిట్ సినిమాలలో ఒకటైన ‘ఆదిత్య 369’కి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ తీయాలనుకుంటున్నాని బాలయ్య ఇటీవలే ప్రకటించారు. దానిలో మోక్షజ్ఞ కూడా ఉంటాడని ఆ సినిమాకు తానే దర్శకత్వం వహిస్తానని బాలయ్య చెప్పారు. కనుక ‘ఆదిత్య 999’ సినిమాకి కూడా బాలయ్య సన్నాహాలు మొదలుపెట్టే ఉంటారు. కనుక త్వరలో ఈ రెండు సినిమా వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.