నితిన్ సరసన కొత్త పిల్ల..!

లవర్ బోయ్ నితిన్ హను రాఘపూడి డైరక్షన్లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ బ్యానర్లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ విషయాల గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అప్పట్లో అమెరికాలోనే 70 శాతం షూటింగ్ అని ఎనౌన్స్ చేసిన చిత్రయూనిట్ మళ్లీ ఆ సినిమా ఊసే ఎత్తలేదు. కొందరేమో ఆ సినిమా ఆగిపోయింది అంటే మరికొందరేమో ఆల్రెడీ షూటింగ్ అవుతుంది అంటున్నారు. అయితే ఈ క్రమంలో హను తన సినిమాలో హీరోయిన్ ను ఎనౌన్స్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు.

ప్రస్తుతం తెలుగు సినిమాలన్ని మలయాళ భామలతో కళకళలాడుతుంటే ఈసారి చెన్నై సుందరిని తెస్తున్నాడు డైరక్టర్ హను రాఘవపుడి. ధనుష్ సరసన ఓ సినిమాలో నటించిన మేఘ, నితిన్ కు జోడిగా సెలెక్ట్ అయ్యింది. చెన్నై చంద్రమా అంటూ నితిన్ మేఘ వెంట పడతాడన్నమాట. మలయాళ భామలకే కాదు చెన్నై భామలకు తెలుగులో ఓ రేంజ్ పాపులారిటీ ఉంది. సమంత లాంటి స్కోప్ ఉన్న ఆర్టిస్ట్ దొరికితే తమ హృదయాలను రాసిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు ప్రేక్షకులు.  

మరి మొత్తానికి ఈ చెన్నై మేఘ ఎలాంటి మెరుపులు మెరిపిస్తుందో చూడాలి. ఇక ఇదే కాకుండా నితిన్ కృష్ణ చైతన్య డైరక్షన్లో త్రివిక్రం, పవన్ కళ్యాణ్ నిర్మాతలుగా ఓ సినిమా చేస్తున్నాడు. దానికి సంబందించిన ముహుర్తం నిన్ననే జరిగింది.