
రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో 2022, మార్చి 24న వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్ గురించి కొత్తగా చెప్పుకోవలసిందేమీ లేదు. ఆస్కార్ అవార్డుతో సహా ఆ సినిమాకి సంబందించి ప్రతీ అంశంపై వార్తలు, విశ్లేషణాల రూపంలో చాలానే విన్నాము.. చూశాము. ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి-మహేష్ బాబు చేయబోయే సినిమాపైనే ఉంది.
అందరూ ఆ సినిమా వివరాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంటే, దాదాపు రెండున్నరేళ్ళ తర్వాత రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్ బిహైండ్ అండ్ బియాండ్’ పేరుతో 1.50 నిమిషాల నిడివి గల ఓ చిన్న వీడియో విడుదల చేశారు.
ఆ సినిమాలో కొన్ని కీలక సన్నివేశాల మేకింగ్ వీడియోతో పాటు నటీనటులు అందరూ తమ అనుభవాలను, మధుర స్మృతులను అభిమానులతో పంచుకున్నారు.
ఆ వీడియో చూసి వారు చెప్పినవి విన్నప్పుడు ఆ సినిమా కోసం వారందరూ ఎంతగా కష్టపడ్డారో, ఎంతగా తపించారో అర్దమవుతుంది. ‘ఆర్‌ఆర్‌ఆర్ బిహైండ్ అండ్ బియాండ్’ మీ కోసం..
Every step, every moment, and every challenge was worth it… Relive the incredible journey with us.#RRRBehindAndBeyond in cinemas on 20th December.#RRRMovie pic.twitter.com/jz5kbAOmkT
— Ram Charan (@AlwaysRamCharan) December 17, 2024