
ఈ 2024 సంవత్సరం ముగింపులో అల్లు అర్జున్-సుకుమార్ కలిసి పుష్ప-2తో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. ఈ సినిమా కోసం చాలా ఆతృతగా, ఓపికగా ఎదురుచూసిన అభిమానులకు వారిద్దరూ ఇచ్చిన గొప్ప కానుక ఇదని భావించవచ్చు.
డిసెంబర్ 5న విడుదలైన పుష్ప-2 ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.1,400 కోట్లు కలెక్షన్స్ సాధించి ఇంకా దూసుకుపోతూనే ఉంది. కనుక సంక్రాంతి పండుగ వరకు థియేటర్లలో ఉంచితే మరో రూ.600 కోట్లు సాధించి రూ.2 ,000 కోట్లు సాధించే అవకాశం కనిపిస్తోంది.
కానీ ఓటీటీలో ప్రసారం కొరకు నెట్‌ఫ్లిక్స్ సంస్థ పుష్ప-2 నిర్మాతలకి రూ.200 కోట్లు సమర్పించుకుంది కనుక సంక్రాంతి పండుగకు ముందే పుష్ప-2ని నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారానికి అప్పగించాల్సి ఉంటుంది.
ఇప్పుడు ఓటీటీ సంస్థల మద్య విపరీతమైన పోటీ నెలకొని ఉన్నందున అన్ని సంస్థలు తమ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగకు పెద్ద సినిమాలు కానుకగా ఇవ్వాలనుకుంటాయి. కనుక తాజా సమాచారం ప్రకారం జనవరి 9 నుంచే పుష్ప-2 నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోందని తెలుస్తోంది. అయితే నెట్‌ఫ్లిక్స్ సంస్థ ఈవిషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.