
గౌతమిపుత్ర శాతకర్ణి డైరక్టర్ క్రిష్ ఆ సినిమా షూటింగ్ మధ్యలోనే డాక్టర్ రమ్యను పెళ్లి చేసుకున్నాడు. షూటింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చినా వీరి పెళ్లి ముచ్చట ఇంకా తీరలేదు. అందుకే డైరెక్ట్ గా తన భార్యను సెట్స్ లో కూడా తన పక్కనే ఉంచుకున్నాడట క్రిష్. అంతేకాదు సెట్స్ లో ప్రతి ఒక్కరితో రమ్య మంచి రిలేషన్ మెయింటైన్ చేసిందట. ముఖ్యంగా శాతకర్ణిలో హీరోయిన్ గా నటిస్తున్న శ్రీయాకు చాలా క్లోజ్ అయ్యిందట రమ్య. ఐ మిస్ యూ.. అంటే ఐ మిస్ యూ.. అని ఒకరినొకరు సెట్స్ నుండి వెళ్లేప్పుడు చెప్పుకునే వారట.
టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇక గ్రాఫిక్ వర్క్ పెండింగ్ ఉంది. సో పెళ్లి ఆ తర్వాత షూటింగ్ ఇలా జరుగడంతో తన భార్యతో సెట్స్ లో కాపురం పెట్టాడని సరదాగా అనుకుంటున్నారు నెటిజెన్లు. కంచె తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా వస్తున్న గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో తన స్టామినా ఇది అని నిరూపించాలని చూస్తున్నాదు క్రిష్. బాలయ్య 100వ సినిమాగా రాబోతున్న ఈ మూవీకు చిరంతన్ భట్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలను అనుకున్న టైంలో ముగించుకుని సంక్రాంతి బరిలో దిగాలని ఫిక్స్ అయ్యాడు బాలయ్య.