పుష్ప-2 మరో కొత్త రికార్డు

అల్లు అర్జున్‌-రష్మిక మందన-సుకుమార్ ముగ్గురూ కలిసి పుష్ప-2తో మ్యాజిక్ చేశారనే చెప్పాలి. ఓ దక్షిణాది హీరో సినిమా ఉత్తరాది రాష్ట్రాలలో ఆడటమే కష్టం. అటువంటిది పుష్ప-2 సినిమా కేవలం 10 రోజులలో ఏకంగా రూ.507.50 కోట్లు కలెక్షన్స్‌ వసూలు చేసి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.

హిందీలో అత్యంత వేగంగా రూ.500 కోట్లు కలెక్షన్స్‌ సాధించిన చిత్రంగా కూడా పుష్ప-2 నిలిచింది. సినిమా విడుదలైన ఆరు రోజులలోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1,000 కోట్లు పైగా కలెక్షన్స్‌ సాధించి రికార్డు నెలకొల్పగా, నేటికీ ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలలో పుష్ప-2 దూసుకుపోతూనే ఉంది. 

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మించిన పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపి, జగపతిబాబు ముఖ్య పాత్రలు చేశారు. పుష్ప-3 కూడ ఉంటుందని, దానిలో కూడా రష్మిక మందనతో సహా ఇదే బృందం పనిచేయనుంది.