ఘాటిలో బందిపోటుగా అనుష్క

అనుష్క మళ్ళీ చాలా రోజుల తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘ఘాటి’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా 2025, ఏప్రిల్ 18న విడుదల చేయబోతున్నామని తెలియజేస్తూ మోషన్ పోస్టర్ విడుదల చేశారు.

దీనికి విక్టిమ్, క్రిమినల్, లెజెండ్ అనే ట్యాగ్ లైన్ జోడించడం ద్వారా ఓ బాధితురాలు, క్రిమినల్, పోరాట యోధురాలుగా మారిందని సూచించారు దర్శకుడు క్రిష్. మోషన్ పోస్టర్‌ని బట్టి ఈ సినిమాలో అనుష్క బందిపోటు నాయకురాలిగా నటిస్తున్నట్లు అర్దమవుతుంది.    

ఈ సినిమాకు దర్శకత్వం: క్రిష్ జాగర్లమూడి, కధ: చింతకింది శ్రీనివాసరావు, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: నాగవెల్లి విద్యాసాగర్, కెమెరా: మనోజ్ రెడ్డి కాటసాని, యాక్షన్: రామ్ కృషన్, ఎడిటింగ్: చాణక్య రెడ్డి తూరుపు చేస్తున్నారు. 

ఈ సినిమాని యూవీ క్రియేషన్స్, ఫైన్ ఆర్ట్స్ బ్యానర్లపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.