బిగ్ బాస్-8 గ్రాండ్ ఫినాలే నేడే..

ప్రముఖ నటుడు నాగార్జున హోస్టింగ్ చేస్తున్న బిగ్ బాస్-8 గత 100 రోజులుగా తెలుగు ప్రేక్షకులను అలరించింది. నేటితో ఆ షో ముగియబోతోంది. ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌, అన్నపూర్ణా స్టూడియోస్‌లో ఈ షో ఫినాలే అట్టహాసంగా జరుగబోతోంది. గ్రాండ్ ఫినాలే ప్రమో విడుదల చేశారు.  

ఇటీవల సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటాని దృష్టిలో ఉంచుకొని, అన్నపూర్ణా స్టూడియోస్ లోపల బయటా భారీగా పోలీసులను మోహరించి వాహనాలను ఇతర మార్గాలలోకి మళ్ళిస్తున్నారు. పోలీసులు పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ, ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగితే వాటికి పూర్తి బాధ్యత ఈ షో నిర్వాహకులదే అని పోలీసులు ముందే హెచ్చరించారు. కనుక నిర్వాహకులు కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

బిగ్ బాస్-8 రియాల్టీ షోలో నిఖిల్, గౌతం, అవినాష్, ప్రేరణ, నబీల్ టాప్-5లో నిలిచారు.వారిలో విజేతగా నిలిచిన వారికి రూ.54,99,999 నగదు బహుమతితో పాటు టైటిల్ లభిస్తుంది.