అన్నదమ్ములిద్దరికీ జోడీ శ్రీలీలే!

సినీ పరిశ్రమలో కొన్నిసార్లు విచిత్రాలు జరుగుతుంటాయి. బడిపంతులు సినిమాలో ఎన్టీఆర్‌కి మనుమరాలిగా నటించిన శ్రీదేవి ఆ తర్వాత ఆయనతోనే హీరోయిన్‌గా అనేక సినిమాలలో నటించారు. ఇప్పుడు అక్కినేని కుటుంబంలో కూడా అటువంటి చిన్న విచిత్రం జరుగబోతోంది. 

కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య 24వ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల చేయబోతోంది. అతని సోదరుడు అఖిల్ అక్కినేని చేయబోయే సినిమాలో కూడా శ్రీలీలని హీరోయిన్‌గా ఎంపిక చేసిన్నట్లు తెలుస్తోంది. అంటే శ్రీలీల అన్నదమ్ములిద్దరితో రొమాన్స్ చేయబోతున్నారన్న మాట! 

అఖిల్ ఏజంట్ సినిమా నిరాశ పరచడంతో దాని తర్వాత ‘వినరో భాగ్యము విష్ణుకధ’ సినిమా దర్శకుడు మురళీ కృష్ణ అబ్బూరుతో అన్నపూర్ణా స్టూడియోస్ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమాలోనే శ్రీలీలని ఎంపిక చేసిన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి వివరాలు ప్రకటించనున్నారు.