బ్యాంకులకేం టోకరా పెట్టలేదు..!

తాను తీసుకున్న బ్యాంక్ రుణాలన్ని కట్టేశానని అంటున్నాడు కింగ్ నాగార్జున. కొద్దిరోజుల క్రితం బ్యాంకులకు అన్నపూర్ణ స్టూడియోస్ మీద ఉన్న అప్పుల కారణంగా నోటీసులు పంపారని టాక్ వచ్చింది. అయితే ఈ విషయంపై అప్పుడు ఎవరు నోరు మెదపలేదు. తాజాగా తను ఏ బ్యాంకుకు అప్పులేనని అన్నిటిని తీర్చేశానని ట్వీట్ చేశారు నాగార్జున. అన్నపూర్ణ స్టూడియో డెవలప్ మెంట్ కోసం బ్యాంకుల నుండి కొంత అప్పు తీసుకున్న మాట వాస్తవమే కాని వాటిని తిరిగి కట్టానని ఎలాంటి బకాయిలు లేవని నాగ్ అన్నారు.

మరి సడెన్ గా నాగార్జున ఈ క్లారిటీ ఇవ్వడానికి గల కారణాలు ఏవై ఉంటాయా అని ఆరా తీస్తున్నారు కొందరు. హీరోగా ఉంటూనే బిజినెస్ లలో కూడా నాగార్జున తన సత్తా చాటుతున్నాడు. కేవలం సిల్వర్ స్క్రీన్ మీదనే కాదు స్మాల్ స్క్రీన్ మీద కూడా నాగ్ సంపాదిస్తున్నారు. మరి ఈ క్లారిటీ ఎందుకు అన్నది పక్కన పెడితే తాను చేసేదంతా న్యాయమైన మార్గమే అని చెప్పినట్టు భావిస్తున్నారు కొందరు.