
అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా చేసిన ‘బచ్చలమల్లి’ సినిమా ట్రైలర్ శనివారం సాయంత్రం 5.04 గంటలకు విడుదల కాబోతోంది. సహజ నటుడు నాని ఈ ట్రైలర్ విడుదల చేయబోతున్నారని తెలియజేస్తూ, రఫ్ లుక్‌లో ఉన్న నాని, అల్లరి నరేష్ ఫోటోలతో ఓ పోస్టర్ విడుదల చేశారు.
అల్లరి నరేష్ 63వ సినిమాగా వస్తున్న బచ్చలమల్లి ఈ నెల 20న విడుదల కాబోతోంది.
సుబ్బు మంగదేవి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, కోటా జయరాం, సాయి కుమార్, ధన్‌రాజ్, హరితేజ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం నాధన్, ఎడిటింగ్: చోట కె ప్రసాద్, స్క్రీన్ ప్లే: విపర్తి మధు చేశారు. హాస్య మూవీఎస్ బ్యానర్‌పై రాజేష్ దండ, బాలాజీ గుట్ట కలిసి నిర్మించారు. బచ్చలమల్లి ట్రైలర్: