బచ్చలమల్లి: ముచ్చటగా మూడో పాట

అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా బచ్చలమల్లి సినిమా నుంచి ‘మరీ అంత కోపం...’ అంటూ సాగే పాట విడుదలైంది. సినిమాలో హీరో తన కోపం, మూర్ఖత్వ ధోరణిపై మదనపడుతున్నట్లు సాగిన ఈ పాటని పూర్ణా చారి వ్రాయగా విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచారు. ఈ పాటని సాయి విగ్ణేష్ ఆలపించిన తీరు చాలా బాగుంది. అయితే వింటున్నప్పుడు ఏదో మలయాళం పాట వింటున్నట్లనిపిస్తుంది.    

అల్లరి నరేష్ 63వ సినిమాగా వస్తున్న బచ్చలమల్లిలో ఓ మూర్ఖుడు, కోపిష్టి వాడిగా నటించారు. అటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడు కూడా ప్రేమలో పడగలడా? పడితే ఎలా ఉంటుందో బచ్చలమల్లి చూసి తెలుసుకోవలసిందే. ఈ సినిమా ఈ నెల 20న విడుదల కాబోతోంది.

సుబ్బు మంగదేవి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో రావు రమేష్, కోటా జయరాం, సాయి కుమార్, ధన్‌రాజ్, హరితేజ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.    

ఈ సినిమాకి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం నాధన్, ఎడిటింగ్: చోట కె ప్రసాద్, స్క్రీన్ ప్లే: విపర్తి మధు చేశారు. హాస్య మూవీఎస్ బ్యానర్‌పై రాజేష్ దండ, బాలాజీ గుట్ట కలిసి నిర్మించారు. 

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/-wbiO6Y0tCU?si=fKjD_WGTmFUDeadJ" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>