
పుష్ప-2 సినిమా టీజర్, ట్రైలర్, పాటలు విడుదల చేస్తేనే కొన్ని గంటల వ్యవధిలో లక్షల మంది చూశారు. సినిమా టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ విషయంలో కూడా పుష్ప-2 కొత్త రికార్డులు సృష్టించింది. ప్రభాస్ నటించిన కల్కి ఏడీ 2898 సినిమాకి బుక్ మై షోలో మొదటి గంటలోనే 97,700 టికెట్స్ అమ్ముడుపోగా, పుష్ప-2 లక్షకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.
ఇప్పుడు మొదటి రోజు కలెక్షన్స్ రికార్డ్ వంతు వచ్చింది. తొలిరోజున ప్రపంచవ్యాప్తంగా రూ.175 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. దానిలో ఒక్క అమెరికా నుంచే రూ.35 కోట్లు వసూలు అయ్యాయని నిర్మాణ సంస్థ తెలియజేసింది.
#Pushpa2TheRule grosses over $1M on Day 1, pushing the North America Box Office total to $4.4M+!#AlluArjun #Pushpa2 #AssaluThaggedheLe #Tupaki pic.twitter.com/t5XYwBnXzl
పుష్ప-2 సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ తదితరులు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ వారిని అభినందించి, పుష్ప-2 సినిమాకి సంబందించి విశేషాలు అడిగి తెలుసుకున్నారు.