
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లాది వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ చేస్తున్నారు. దీని తర్వాత సినిమా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్నట్లు ఈరోజే ప్రకటన వెలువడింది. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమాని నాచురల్ స్టార్ నానికి చెందిన యూనినిమాస్ మూవీస్ సమర్పణలో తీయబోతున్నారు.
నాని ఈవిషయం తెలియజేస్తూ, “చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాయను. ఆయన సినిమాలు చూసేందుకు గంటల తరబడి క్యూలైన్లో నిలబడ్డాను. ఓ సారి నా సైకిల్ పోగొట్టుకున్నాను. కానీ ఆయన సినిమా చూసి పండుగ చేసుకునేవాడిని, ఇప్పుడు నేనే ఆయన సినిమాని సమర్పించబోతున్నాను. దీంతో ఓ పూర్తి సర్కిల్ పూర్తయింది,” అని ట్వీట్ చేశారు.
ఎర్రటి బ్యాక్ గ్రౌండ్‌తో ఉన్న ఆ పోస్టర్‌లో రక్తం కారుతున్న చిరంజీవి చేతిని మాత్రం చూపారు. “హింసలో తన ప్రశాంత చూసుకుంటున్నారు,” అని పక్కన వ్రాశారు. అంటే ఈ సినిమా పూర్తి యాక్షన్ మూవీ కావచ్చని సూచించిన్నట్లే భావించవచ్చు. ఈ సినిమాని చెరుకూరి సుధాకర్ నిర్మించబోతున్నారు.
ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల-నానితో ది ప్యారడైజ్ చేస్తున్నారు. అది పూర్తి కాగానే చిరంజీవితో ఈ సినిమా ప్రారంభిస్తారు. ఈ సినిమాకు సంబందించి పూర్తి వివరాలు ఇంకా ప్రకటించవలసి ఉంది.