అల్లు అర్జున్‌ పారితోషికం బయటపెట్టిన వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ పుష్ప-2 గురించి చెపుతూ మెగాస్టార్ చిరంజీవి కంటే అల్లు అర్జున్‌ చాలా ఎత్తుకి ఎదిగిపోయాడని, ఇప్పుడు అల్లు అర్జునే సినీ పరిశ్రమలో మెగాహీరో ఇంకా చెప్పాలంటే బాహుబలి కాదు మెగాబలి అంటూ ప్రశంశల వర్షం కురిపించారు. 

అంతేకాదు.. పుష్ప-2 సినిమా కోసం అల్లు అర్జున్‌ అక్షరాల 287 కోట్ల 36 లక్షల రూపాయలు పారితోషికం తీసుకున్నారనే విషయం వర్మ బయటపెట్టేశారు. 

అల్లు అర్జున్‌ మెగా కంటే మెగాహీరో అని చెప్పడానికి మూడు కారణాలు అంటూ వర్మ ఏం చెప్పారంటే.. 

1. భారతీయ సినీ చరిత్రలో సినిమా రిలీజ్ విషయంలో, తొలి రోజు కలెక్షన్స్ విషయంలో పుష్ప-2 రికార్డ్ సృష్టించబోతోంది. ఇప్పటి వరకున్న అన్ని రికార్డులను బద్దలు కొట్టబోతోంది. 

2. భూమి అనబడే ఈ గ్రహం (ప్లానెట్) మీద గల యావత్ దేశాలలో పుష్ప-2 విడుదల కాబోతోంది కనుక అల్లు అర్జున్‌ ‘ప్లానెట్ స్టార్’గా నిలుస్తున్నారు. 

3. ఈ సినిమా కోసం అల్లు అర్జున్‌ రూ.387 కోట్ల 36 లక్షలు పారితోషికం తీసుకున్నారు. ఇది మెగా పారితోషికం కంటే అనేక రెట్లు మెగా మెగా. సినీ పరిశ్రమలో మరే హీరో ఈ స్థాయికి ఎదగలేదు కనుక అల్లు అర్జున్‌ ట్రూ ‘టవర్ స్టార్.’ అల్లు అర్జున్‌ ఇక నుంచి మెగా అల్లు అర్జున్‌... బాహుబలికి మించిన మెగాబలి        అని వర్మ అల్లు అర్జున్‌ మీద ప్రశంశల వర్షం కురిపించారు.

ఎలాగూ ఈ ట్వీట్స్ వైరల్ అవుతాయి కనుక వర్మ తెలివిగా తన ‘సారీ’ సినిమా జనవరి 30 న విడుదల కాబోతోందనే ప్రకటన దానికి జోడించేశారు. తద్వారా తన సినిమా పోస్టర్ కూడా షేర్ అవుతూ ఉచితంగా పబ్లిసిటీ లభిస్తుందనే వర్మ ఆలోచన అద్భుతంగా ఉంది.