పుష్ప-2 సినిమాని 2డితో పాటు 3డి ఫార్మా ట్‌లో కూడా విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ చెప్పింది. ఆ మేరకు అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్ కూడా జరిగాయి. కానీ 3డి ఫార్మా ట్ కాపీ ఇంకా సిద్దం కాలేదట. సినిమా షూటింగ్ సమయంలోనే 3డి ఫార్మా ట్‌లో కూడా ఘాట్ చేసినప్పటికీ తదనంతర పనులు ఇంకా పూర్తికాకపోవడం వలన మరో మూడు నాలుగు రోజుల వరకు 3డి ఫార్మా ట్ అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం.
కనుక 3డి ఫార్మా ట్‌లో సినిమా టికెట్స్ కొనుగోలు చేసినవారు కూడా ప్రస్తుతానికి 2డి ఫార్మా ట్‌లోనే పుష్ప-2 సినిమా చూడవలసిరావచ్చు. అయితే దీని గురించి మైత్రీ మూవీ మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన చేయవలసి ఉంది.
పుష్ప-2 తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో కాపీలు మాత్రం సిద్దంగా ఉన్నాయి. విడుదలకు ముందు మళ్ళీ ఓసారి సుకుమార్ టీమ్ చెక్ చేసుకొని ఏమైనా సరిదిద్దాల్సినవి ఉంటే ఈరోజు రాత్రిలోగా ఆ పనులు కూడా పూర్తిచేసి డిస్ట్రిబ్యూటర్లకు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది.