
పుష్ప సిరీస్‌లో 1,2 వచ్చాయి. పుష్ప-3 కూడా ఉంటుందని అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ ఇద్దరూ చెప్పారు. ఒకవేళ మొదలుపెడితే అది పూర్తి చేయడానికి అల్లు అర్జున్ కనీసం మూడేళ్ళు సమయం కేటాయించాల్సి ఉంటుందని సుకుమార్ చెప్పారు.
అంత సమయం కేటాయిస్తానంటే తాను పుష్ప-3కి రెడీ అనీ సుకుమార్ అన్నారు. అయితే ఇద్దరూ వేర్వేరు సినిమాలు చేయవలసి ఉండటంతో మరో రెండు మూడేళ్ళ వరకు పుష్ప-3 మొదలయ్యే అవకాశమే లేదు.
పుష్ప-3 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు కానీ దాని పేరు ‘పుష్ప-3, ది ర్యాంపేజ్’ అని ముందే ఖాయం చేశారు. పుష్ప-2కి సౌండ్ ఇంజనీరుగా ఆస్కార్ అవార్డు గ్రహీత రసూల్ పూకుట్టి చేశారు.
ఆయన తన బృందంతో కలిసి దిగిన ఓ ఫోటోలో వెనుక ‘పుష్ప-3, ది ర్యాంపేజ్’ అనే పోస్టర్ కనిపించింది. కనుక పుష్ప-2 తర్వాత ఆ పేరుతో సినిమా తీయబోతున్నట్లు స్పష్టమైంది.
పుష్ప-2 సినిమా క్లైమాక్స్ సన్నివేశంలో పుష్ప-3కి సంబందించి ఓ హింట్ ఉంటుందని సమాచారం. రేపు రాత్రే పుష్ప-2 విడుదల కాబోతున్నప్పుడు, ఆ హింట్ గురించి ఆలోచించడం తినబోతూ గారెలా రుచి ఎలా ఉందని అడిగిన్నట్లే ఉంటుంది.
పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, జగపతిబాబు, శ్రీతేజ్, మీమ్ గోపి ముఖ్య పాత్రలు చేశారు.
మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ చేశారు.