
ప్రియదర్శి, రూప కొడువయూర్ జంటగా ‘సారంగపాణి జాతకం’ ఈ నెల 20న విడుదల కాబోతోంది. సారంగో సారంగా అంటూ హుషారుగా సాగిన మొదటి లిరికల్ సాంగ్ చాలా బాగుంది. ఇప్పుడు ‘సంచారీ సంచారీ..’ అంటూ సాగే మరో లిరికల్ సాంగ్ విడుదలైంది.
ఈ పాటని రామజోగయ్య శాస్త్రి వ్రాయగా దానిని వివేక్ రామస్వామి సాగర్ స్వరపరిచారు. ఈ పాటని సంజీత్ హెగ్డే పాడారు. ప్రియదర్శి హీరోగా ‘సారంగపాణి జాతకం’ సినిమా అంటే పూర్తి కామెడీ అని వేరే చెప్పక్కరలేదు.
తాజాగా విడుదల చేసిన ‘సంచారీ సంచారీ.. చిరునామా లేని లేఖలా నీ పయనం ఎటువైపో..” అంటూ విషాద స్వరంతో ఆలపించిన పాట, ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు‘సారంగపాణి జాతకం’లో ఏదో గంభీరమైన కధ కూడా ఉందనిపిస్తుంది.
ఈ సినిమాలో తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిషోర్, వివా హర్ష, శివన్నారాయణ, అశోక్ కుమార్, వికె నరేశ్, రాజా చెంబోలు, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేశ్ రెడ్డి, కల్పలత, రూప లక్ష్మి, హర్షిణి, కెఎల్‌కె మణి, ఐమాక్స్ వెంకట్ ముఖ్యపాత్రలు చేశారు.
శ్రీదేవీ మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకి కధ, దర్శకత్వం: ఇంద్రగంటి మోహనకృష్ణ, సంగీతం: వివేక్ రామస్వామి సాగర్, కెమెరా: పీజీ విందా, ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్, స్టంట్స్: వెంకట్, వెంకటేష్ చేశారు.