
కార్తికేయ సినిమాతో తన దర్శకత్వ ప్రతిభ చాటి వారెవా అనిపించుకున్న చందు మొండేటి రీసెంట్ గా వచ్చిన ప్రేమం తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ప్రేమం రిజల్ట్ చూసి నాగ్ చందుకి ఛాన్స్ ఇచ్చాడని అన్నారు. అయితే అదేదో కామెడీకి అనుకున్నారు కాని సీరియస్ గానే అని ఇప్పుడు తెలుస్తుంది. నాగార్జున హీరోగా చందు డైరక్షన్లో ఓ సినిమా షురూ చేస్తున్నారట. చందు ఇందులో నాగార్జునను పోలీస్ గా చూపిస్తున్నాడట.
ఇప్పటికే నాగార్జున చాలా సినిమాల్లో పోలీస్ రోల్ చేశారు అయితే ఈ కథ వాటికన్నిటికి డిఫరెంట్ గా ఉంటుందని చందు చెబుతున్నాడు. కార్తికేయ కాదు ప్రేమం కూడా హిట్ చేసుకుని తన సత్తా చాటుకున్న చందు మొండేటి నాగ్ సినిమా కూడా హిట్ కొట్టి హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ గా స్టార్ క్రేజ్ సంపాదించాలని చూస్తున్నాడు.
ప్రస్తుతం నాగార్జున ఓం నమో వెంకటేశాయ షూట్ లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తి చేశాక చందుతోనే సినిమా ఉంటుందని అంటున్నారు. ఇక ఇదే కాకుండా యాంకర్ ఓంకార్ డైరక్షన్ లో కూడా నాగ్ ఓ సినిమా కమిట్ అయ్యాడట. ఆ సినిమా మాత్రం పివిపి నిర్మిస్తున్నారని తెలుస్తుంది.