
అక్కినేని నాగ చైతన్య, శోభూ ధూళిపాళ డిసెంబర్ 4 వ తేదీన పెళ్ళి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అక్కినేని అఖిల్ కూడా పెళ్ళి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయం వారి తండ్రి అక్కినేని నాగార్జున స్వయంగా వెల్లడించారు.
ఢిల్లీకి చెందిన జైనబ్ రవ్జీని తన కుమారుడు అఖిల్ వివాహం చేసుకోబోతున్నాడని తెలియజేస్తూ ఆమెను అక్కినేని కుటుంబంలో సంతోషంగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. జైనబ్ రవ్జీకి నాటక రంగంలో నటిగా, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తిగా గుర్తింపు ఉంది. ఆమె దుబాయ్, లండన్‌లో కూడా ప్రదర్శనలు ఇచ్చి మెప్పించారు.
వారిరువురికీ రెండేళ్ళ క్రితం పరిచయం ఏర్పడి తర్వాత ప్రేమలో పడ్డారు. అఖిల్ తండ్రి జుల్ఫీ రవ్జీతో నాగార్జునకు ఎప్పటి నుంచో మంచి స్నేహం ఉంది. కనుక అఖిల్, జైనాబ్ ప్రేమను ఇరుకుటుంబాలు అంగీకరించి పెళ్ళి చేయబోతున్నారు. ఈరోజు వారి వివాహ నిశ్చితార్ద వేడుక జరిగింది.
అఖిల్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్నప్పటికీ ఇంతవరకు సరైన హిట్ పడలేదు. గత ఏడాది ‘ఏజంట్’ సినిమా కూడా నిరాశ పరిచింది. ప్రస్తుతం మరో సినిమాకు సిద్దామవుతూ, ముందుగా తన పెళ్ళి ప్రకటన చేశాడు.
నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా పూర్తి చేసి, డిసెంబర్ 4న పెళ్ళి తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకొని తర్వాత తన 24 వ సినిమా కార్తీక్ దండు దర్శకత్వంలో మొదలుపెట్టబోతున్నాడు.