
నేటితో పుష్ప-2 షూటింగ్ పూర్తయిపోయింది. అల్లు అర్జున్ స్వయంగా సోషల్ మీడియాలో లొకేషన్ ఫోటో షేర్ చేస్తూ పుష్ప షూటింగులో చివరి రోజు చివరి షాట్.. పుష్ప 5 ఏళ్ళ ప్రయాణం పూర్తయింది. ఎంతో అద్భుతంగా సాగింది ఈ ప్రయాణం,” అని ట్వీట్ చేశారు.
దర్శకుడు సుకుమార్ కూడా 5 ఏళ్ళ ప్రయాణంతో నేటితో ముగిసిందని ట్వీట్ చేస్తూ డిసెంబర్ 5న పుష్ప-2 విడుదల కాబోతోందని తెలియజేశారు.
పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపి, జగపతిబాబు ముఖ్య పాత్రలు చేశారు. శ్రీలీల, అల్లు అర్జున్ బృందం చేసిన కిస్సిక్ ఐటం సాంగ్ సోమవారం విడుదలైంది.
పుష్ప-2కి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందించారు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు.