రాబిన్‌హుడ్… మరో లిరికల్ సాంగ్

నితిన్, శ్రీలీల జంటగా ‘రాబిన్‌హుడ్’ నుంచి వన్ మోర్ టైమ్ అంటూ సాగే లిరికల్ సాంగ్ ఈరోజు సాయంత్రం విడుదలైంది. కృష్ణకాంత్ వ్రాసిన పాటని జీవీ ప్రకాష్ కుమార్ స్వరపరచి స్వయమా పాడగా ఆయనతో విద్య వోక్స్ స్వరం కలిపి పాడింది. ఇటువంటి ఫాస్ట్ బీట్ పాట అంత నెమ్మదిగా సాగడం, దాని డాన్స్ కంపోజిషన్ కూడా అలాగే ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కధ, దర్శకత్వం: వెంకీ కుడుముల, సంగీతం: జీవి ప్రకాష్, కెమెరా: సాయి శ్రీరామ్, ఆర్ట్ డైరెక్టర్: రామ్ కుమార్, ఎడిటింగ్: కోటి చేస్తున్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమా డిసెంబర్‌ 25న విడుదల కాబోతోంది.