3.jpeg)
మన రాజాసాబ్.. అదే ప్రభాస్.. యూరప్ బయలుదేరుతున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ సినిమాలో హీరోయిన్ మాళవిక మోహనన్‌తో ఓ పాటేసుకోవడానికి వెళుతున్నారు.
రాజాసాబ్ ఏప్రిల్ 10న విడుదల కాబోతోంది. అదే నెలలో 25న ప్రభాస్ అతిధి పాత్ర చేసిన కన్నప్ప సినిమా కూడా విడుదలకాబోతోంది. అంటే ప్రభాస్ అభిమానులకు ఓకే నెలలో రెండు కానుకలన్న మాట!
మారుతీ మార్క్ హర్రర్, కామెడీ మిక్స్ సినిమాగా వస్తున్న రాజాసాబ్‌లో ప్రభాస్‌కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: కార్తీక్ పళని, ఆర్ట్ డైరెక్టర్: రాజీవన్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు చేస్తున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. సలార్, కల్కి వంటి సీరియస్ సినిమాల తర్వాత హర్రర్-కామెడీ మిక్స్ జోనర్‌లో వస్తున్న సినిమా గనుక రాజాసాబ్‌పై చాలా భారీ అంచనాలున్నాయి. పైగా ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయారు. మరి మారుతీ ‘రాజాసాబ్’ స్థాయికి తగ్గట్లు తీర్చిదిద్ది అందిస్తారో లేదో తెలియాలంటే ఏప్రిల్ 10 వరకు ఎదురుచూడక తప్పదు.