పవన్-త్రివిక్రం-నితిన్..వాట్ ఏ కాంబో ప్యాక్..!

పవన్ అంటే అభిమానమే కాదు అంతకుమించి అని ప్రతిసారి చెప్పే నితిన్ అదే పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ లో సినిమా చేయడం కాస్త షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎప్పుడు జరిగిందో ఎలా జరిగిందో తెలియదు కాని కృష్ణ చైతన్యతో సినిమా కమిట్ అయిన నితిన్ ఆ సినిమా నిర్మాతలుగా త్రివిక్రం, పవన్ కళ్యాణ్ భాగస్వామ్యులు కావడం ఆశ్చర్యపడేలా చేసింది.

పవన్ ఆడియో వేడుకకు వస్తేనే సినిమా హిట్ అని సెంటిమెంట్ లా ఫీలయ్యే నితిన్ ఏకంగా పవర్ స్టార్ నిర్మాతగా చేస్తున్న సినిమాలో హీరోగా నటించడం నిజంగా నితిన్ లక్కీ అని చెప్పాలి. ఇక పవన్ మాత్రమే కాదు త్రివిక్రం కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగం కావడం సినిమా మీద అంచనాలను పెంచేసింది. త్రివిక్రం లాంటి డైరక్టర్ ను ఇంప్రెస్ చేశాడంటే కచ్చితంగా కృష్ణ చైతన్య టాలీవుడ్ లో మరో మంచి దర్శకుడు అనిపించుకుంటాడని చెప్పేయొచ్చు. ఈరోజు ముహుర్తం జరుపుకున్న ఈ సినిమా త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.