
హనుమాన్ సూపర్ హిట్ అయిన తర్వాత ఆ జోనర్లో వరుస పెట్టి అనేకమంది సినిమాలు తీయడం ప్రారంభించారు. వాటిలో వశిష్ట కూడా ఒకటి. హరీష్ చావా దర్శకత్వంలో సుమన్ తేజ్, అనుశ్రీ జంటగా వశిష్ట సినిమాకి ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో పూజా కార్యక్రమం జరిగింది. లిటిల్ బేబీస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నోరి నాగప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
పౌరాణిక గాధని వర్తమాన కాలంతో ముడిపెడుతూ గ్రామీణ నేపద్యంలో సాగే సోషల్ డ్రామా ఇదని దర్శకుడు హరీష్ చావా చెప్పారు. కధ చెప్పగానే హీరో సుమన్ తేజ్, నిర్మాత నాగ ప్రసాద్ ఇద్దరూ వెంటనే ఓకే చెప్పేశారని హరీష్ చావా చెప్పారు.
ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్ సిద్దం చేసుకొని షూటింగ్ మొదలుపెడతామని చెప్పారు. అందరినీ అలరించే ఓ చక్కటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తామని నిర్మాత నాగ ప్రసాద్ చెప్పారు. త్వరలోనే ఈ సినిమాలో నటించబోతున్న ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.