ప్రముఖ నటి సమంత చాలా కాలం తర్వాత తన ఖాతాలో ఓ సూపర్ హిట్ వేసుకున్నారు. అదే రాజ్ అండ్ తరుణ్ దర్శకత్వంలో చేసిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్ హనీ బన్నీ.’ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతున్న ఈ ఒక్క వెబ్ సిరీస్ తో సమంత పేరు మళ్ళీ దేశవ్యాప్తంగా మారు మ్రోగిపోతోంది.
ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా సమంత ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాత వరుణ్ ధావన్ తో సరదాగా చిట్ చాట్ చేశారు.
ఈ కార్యక్రమంలో ‘రాపిడ్ ఫైర్’ ప్రశ్నలకు టక్కున జవాబు చెప్పాల్సి ఉంటుంది. చెప్పదలచుకోకపోతే అక్కడ ఉంచిన పచ్చి మిరపకాయ నమిలి తినాల్సి ఉంటుంది. దానిలో ఓ ఆసక్తికరమైన ప్రశ్న కూడా ఉంది.
వరుణ్ ధావన్ ప్రశ్న: మీ సంపాదనలో అవసరం లేకపోయినా ఎక్కువగా దేని కోసం ఖర్చు చేసేవారు?
సమంత” మాజీ (నాగ చైతన్య)కి ఖరీదైన బహుమతులు కొనేందుకు.
వరుణ్ ధావన్: ఎంత ధర ఉండేవి?
సమంత: కాస్త ఎక్కువే. ఈ టాపిక్ ఇక చాలు.
సమంత ఎవరికి ఖరీదైన బహుమతులు కొని ఇచ్చేదో అందరికీ అర్దమయ్యే ఉంటుంది. ఆమె తప్పనిసరి పరిస్థితిలో ఆ సమాధానం చెప్పినప్పటికీ నాగ చైతన్యకు, ఆయన అభిమనులకు అది చురుక్కుమనిపించక మానదు. కానీ ఆమె చెప్పింది వాస్తవమే కనుక ఖండించలేరు.