
‘విరూపాక్ష’తో ప్రేక్షకులను మెప్పించిన కార్తీక్ దండు దర్శకత్వంలో నాగ చైతన్య తన 24 వ సినిమా చేయబోతున్నారు. శనివారం నాగ చైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆయన చేయబోయే కొత్త సినిమా ప్రీ-లుక్ విడుదల చేశారు. దానిలో ఓ జంతువు కన్ను... దానిలో ఓ కొండ గుహలో నిలబడిన నాగ చైతన్యని చూపారు. అంటే సాహసయాత్ర కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెర కెక్కించబోతున్నట్లు అనిపిస్తోంది.
ఈ సినిమాలో నాగ చైతన్యకి జోడీగా మీనాక్షి చౌదరి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతలు బీవీఎన్ ప్రసాద్, సుకుమార్. త్వరలోనే ఈ సినిమాకి సంబందించి పూర్తి వివరాలు ప్రకటిస్తారు.
నాగ చైతన్య ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నాగ చైతన్యకు జంటగా సాయి పల్లవి చేస్తోంది. నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా నిన్న తండేల్ సినిమా నుంచి కూడా ఓ పోస్టర్ విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలో సముద్రంలో చేపలు పట్టేవారి జీవితాలలో జరిగిన కొన్ని యధార్ధ ఘటనల ఆధారంగా ఈ సినిమాని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తీస్తున్నారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది.