
కిరణ్ అబ్బవరం ఖాతాలో ఓ సూపర్ హిట్ సినిమాగా ‘క’ నిలిచింది. అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమా ఇటు ప్రేక్షకులు, అటు సినీ విశ్లేషకుల ప్రశంశలు కూడా అందుకుంది. నూతన దర్శకులు సుజీత్-సందీప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా చేశారు.
చిన్న సినిమాగా వచ్చి నెలరోజులలోనే 50 కోట్లు కలెక్షన్స్ సాధించి ఇంకా దూసుకుపోతోంది. ఈ సినిమాకి మంచి ప్రేక్షకాదరణ లభిస్తుండటంతో ప్రముఖ నటుడు సల్మాన్ దుల్కర్ ఈ సినిమా మలయాళం డిస్ట్రిబ్యూషన్ హక్కులు తీసుకొని కేరళ రాష్ట్రంలో మలయాళం డబ్బింగ్ వెర్షన్ శుక్రవారం విడుదల చేశారు.
త్వరలో హిందీతో సహ మరిన్ని భారతీయ భాషల్లో విడుదల చేయబోతునట్లు కిరణ్ అబ్బవరం చెపారు. ఈ సినిమా విడుదలై నెలరోజులు పూర్తవుతుండటంతో ఈ నెల 28 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ప్రసారం కాబోతోంది.
ఓ ఊరులో అమ్మాయిలు కనబడకుండా పోతుంటారు. కాంట్రాక్ట్ పోస్ట్ మ్యాన్ గా పనిచేస్తున్న హీరో (కిరణ్ అబ్బవరం)కి చిన్నప్పుడు నుంచే ఇతరుల ఉత్తరాలు దొంగతనంగా చదివే దూరాలవాటు ఉంటుంది. ఆ దురలవాటు వలననే ఊళ్ళో అమ్మాయిలు కనబడకుండా ఎలా మాయం అవుతున్నారో హీరోకి చిన్న క్లూ దొరుకుతుంది. చివరికి ఏం జరిగిందో సినిమా చూసి తెలుసుకోవలసిందే.