
సూర్య 44 అనే వర్కింగ్ టైటిల్ తో సూర్య హీరోగా తీస్తున్న సినిమా గురించి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. రొమాంటిక్ యాక్షన్ సినిమాగా దీనిని తెర కెక్కిస్తున్నామని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయిందని వచ్చే ఏడాది వేసవి సెలవులలో సూర్య 44 విడుదల చేస్తామని చెప్పారు.
త్వరలోనే ఈ సినిమా పాటలు, ఆ తర్వాత టీజర్, ట్రైలర్ వరుసగా విడుదల చేస్తామని చెప్పారు. దేశంలో ప్రతిభావంతులైన నటులలో సూర్య ఒకరని కార్తీక్ సుబ్బారాజు ప్రశంశించారు. ఇటువంటి గొప్ప నటుడితో తాను సినిమా చేస్తుండటం తన అదృష్టమని అన్నారు. ఈ సినిమాలో సూర్య గెటప్,యాక్షన్ సీన్స్ చాలా భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా చేసింది.
గేమ్ ఛేంజర్ సినిమా గురించి కార్తీక్ సుబ్బరాజు మాట్లాడుతూ, “నేను శంకర్ సినిమాలు చూసి ఆ స్పూర్తితోనే దర్శకుడి ని అయ్యాను. ఇప్పుడు ఆయన సినిమాకే నేను కధ వ్రాయడం నాకు చాలా ఆనందం కలిగిస్తోంది. ఇది ఆయన టేకింగ్ స్టైల్ దృష్టిలోపెట్టుకొని వ్రాసిన కధే. నా కధని ఆయన ఏవిదంగా తెర కెక్కిస్తారో చూడాలని నేను కూడా చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నాను,” అని అన్నారు.
గేమ్ ఛేంజర్ సినిమా జనవరి 10 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కియరా అద్వానీ నటిస్తోంది.