ఈసారి తాంబరంలో పుష్ప-2 వైల్డ్ ఫైర్ ఈవెంట్!

అల్లు అర్జున్‌-సుకుమార్ కాంబినేషన్‌ పుష్ప-2 ట్రైలర్‌ బిహార్‌ రాజధాని పాట్నాలో విడుదల చేయగా దానికి కనీవినీ ఎరుగని స్థాయిలో స్పందన వచ్చింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో కూడా పుష్ప-2 ట్రైలర్ వైరల్ అయ్యింది. కొన్ని గంటల వ్యవధిలోనే దానికి లక్షల వ్యూస్ వచ్చాయంటే పుష్ప-2 క్రేజ్ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. 

డిసెంబర్ 5 వ తేదీన పుష్ప-2 విడుదల కాబోతుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ కూడా పెంచారు. రేపు ఆదివారం చెన్నైలోని తాంబరం వద్ద సాయి రామ్ ఇంజనీరింగ్ కాలేజీలో లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో పుష్ప-2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి అక్కడ పుష్ప-2 వైల్డ్ ఫైర్ మొదలవుతుంది. 

మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మించిన పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, జగపతిబాబు, శ్రీతేజ్, మీమ్ గోపిలు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ చేశారు.