
తొలిసారిగా అమెరికాలో ఓ భారతీయ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుగబోతోంది. అదే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్, కియరా అద్వానీ జంటగా నటించిన ‘గేమ్ ఛేంజర్.’ ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఏపీలో కాకినాడ జిల్లాతో పాటు అమెరికాలో కూడా నిర్వహించబోతున్నారు.
అమెరికాలో కర్టీస్ కల్ వెల్ సెంటర్, 4999 నామన్ ఫారెస్ట్ , గార్లాండ్ టిఎక్స్ 75040 వద్ద డిసెంబర్ 21వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జరుగుతుందని ప్రకటించారు.
కాకినాడలో గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు నిర్వహించబోతున్నారో ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు.
గేమ్ ఛేంజర్‌లో అంజలి, ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.