అదే నేను అసలు లేను... బచ్చలమల్లి రొమాంటిక్ సాంగ్‌

సుబ్బు  మంగదేవి  దర్శకత్వంలో అల్లరి నరేష్, అమృత అయ్యర్ జంటగా నటిస్తున్న ‘బచ్చలమల్లి’  సినిమా నుంచి “అదే నేను... అసలు లేను...” అంటూ చాలా మధురంగా సాగే రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్‌ శుక్రవారం మధ్యాహ్నం విడుదలైంది. కృష్ణకాంత్ వ్రాసిన ఈ రొమాంటిక్ సాంగ్‌ని విశాల్ చంద్రశేఖర్ చాలా చక్కగా స్వరపరిచగా ఎస్పీ చరణ్, రమ్యా బెహరా అంతే మృధుమధురంగా పాడారు.   

ఈ సినిమాలో అల్లరి నరేష్‌ ట్రాక్టర్ నడుపుకుంటూ జీవించే బచ్చల మల్లిగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ విడుదల చేసినప్పుడే బచ్చలమల్లి క్యారెక్టర్‌ గురించి “ఈ బచ్చలమల్లి ఖచ్చితంగా మీకు చాలా చాలా రోజులు గుర్తుండి పోతాడు... ఆరడుగుల మూర్ఖుడు,” అంటూ పరిచయం చేశారు. 

ఈ సినిమాలో రావు రమేష్, కోటా జయరాం, సాయి కుమార్, ధన్‌రాజ్, హరితేజ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.    

ఈ సినిమాకి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: రిచర్డ్ ఎం నాధన్, ఎడిటింగ్: చోట కె ప్రసాద్, స్క్రీన్ ప్లే: విపర్తి మధు చేస్తున్నారు.

అల్లరి నరేష్ 63వ సినిమాగా వస్తున్న ‘బచ్చలమల్లి’ని రాజేష్ దండ, బాలాజీ గుట్ట కలిసి హాస్య మూవీఎస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. క్రిస్మస్ పండుగ కానుకగా డిసెంబర్‌ 20వ తేదీన బచ్చలమల్లి ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.