ఓ బుజ్జితల్లి నీ కోసం... తండేల్ నుంచి లిరికల్

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చేస్తున్న ‘తండేల్’ నుంచి ‘ఓ బుజ్జి తల్లి నీకోసం... ‘ అంటూ మృధుమధురంగా సాగే పాట విడుదలైంది. శ్రీమణి వ్రాసిన ఈ పాటని దేవీశ్రీ ప్రసాద్‌ స్వరపరచగా, జావేద్ అలీ ఎంతో మృధుమధురంగా పాడారు. 

పాటకి సంగీతం, పాట సాహిత్యం చాలా బాగున్నాయి. ఆ పాటలో నాగచైతన్య-సాయి పల్లవిలను చూపిన తీరు ఇంకా అద్భుతంగా ఉంది. ‘తండెల్’ ఫిబ్రవరి 7వ తేదీన విడుదల కాబోతోంది. 

చందూ మొండేటి దర్శకత్వంలో ఓ యధార్ధ గాధ, ఘటనల ఆధారంగా ఈ సినిమాని తీస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో మత్స్యకారుల జీవితాన్ని ఈ సినిమాలో చూపబోతున్నారు. 

ఈ సినిమాకి దర్శకత్వం: చందూ మొండేటి, కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. తండెల్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి నిర్మిస్తున్నారు.  

<iframe width="560" height="315" src="https://www.youtube.com/embed/DDBUrQ8bdlc?si=XjrPx1VfshS_3FiO" title="YouTube video player" frameborder="0" allow="accelerometer; autoplay; clipboard-write; encrypted-media; gyroscope; picture-in-picture; web-share" referrerpolicy="strict-origin-when-cross-origin" allowfullscreen></iframe>