‘పుష్ప-2 ది రూల్’ ఐటెమ్ సాంగ్ కోసం అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. పుష్ప1లో ఊ అంటావా మావా ఊహూ అంటావా... అంటూ సాగే పాట, దానికి సమంత చేసిన డాన్స్ ఆ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.
కనుక పుష్ప-2లో కిస్సిక్ ఐటెమ్ సాంగ్, దానికి శ్రీలీల చేసిన డ్యాన్స్ మరెంత గొప్పగా ఉంటుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ పాటని నవంబర్ 24న సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేస్తామని తెలియజేస్తూ అల్లు అర్జున్, శ్రీలీల పోస్టర్ విడుదల చేశారు. ఆ పోస్టర్ చూస్తేనే అల్లు అర్జున్ అభిమానులు ఆనందం పట్టలేకపోవచ్చు.
వారిద్దరూ ధరించిన ఎరుపు, నలుపు డ్రెస్సులు, అల్లు అర్జున్ ఇచ్చిన ఫోజ్ అద్భుతంగా ఉన్నాయి. మరి కిస్సిక్ ఎంతగా ఊర్రూతలూగిస్తుందో చూడాలి.
పుష్ప-2లో ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, జగపతిబాబు, శ్రీతేజ్, మీమ్ గోపిలు ముఖ్య పాత్రలు చేశారు. పుష్ప-2కి దర్శకత్వం: సుకుమార్, కెమెరా: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ చేశారు.
ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించారు. డిసెంబర్ 5న పుష్ప-2 ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.
#Kissik 📸 song from #Pushpa2TheRule Flashing Worldwide on November 24th from 7:02 PM ❤🔥
It is time for Icon Star @alluarjun & Dancing Queen @sreeleela14 to set the dance floor on fire 🔥
A Rockstar @Thisisdsp's Musical Flash⚡⚡
GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER,… pic.twitter.com/i6ZF9I10He