
ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన కల్కి ఎడి2898 ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయ్యి భారీగా కలక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికాలో ఈ సినిమాకి ఎన్ఆర్ఐలతో పాటు విదేశీయులు కూడా భారీ సంఖ్యలో తరలివచ్చి చూసి ఆనందించారు.
అయితే అమెరికాలో భారీగా కలక్షన్స్ వచ్చినప్పటికీ కల్కి డిస్ట్రిబ్యూటర్ సంస్థలు తక్కువ చేసి చూపాయని వైజయంతీ మూవీస్ ఆరోపిస్తోంది. దీనిపై అమెరికా డిస్ట్రిబ్యూటర్లకు, వైజయంతీ మూవీస్ మద్య అప్పటి నుంచే వివాదం కొనసాగుతోంది.
కానీ ఈ చిక్కుముడి వీడకపోవడంతో వైజయంతీ మూవీస్ అమెరికా డిస్ట్రిబ్యూటర్లకు లీగల్ నోటీసు జారీ చేసింది. ఒక భారతీయ సినీ నిర్మాణ సంస్థ విదేశీ డిస్ట్రిబ్యూటర్లపై న్యాయపరమైన చర్యలకు సిద్దపడటం ఇదే మొదటిసారి కనుక ఈ వివాదం ఏవిదంగా సాగి ముగుస్తుందో అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈ తాజా వివాదంతో విదేశాలలో భారతీయ సినిమాల విడుదల విషయంలో నెలకొన్న కొత్త సమస్యలు బయటపడుతున్నాయి. ఈ ప్రభావం జనవరిలో విడుదలవుతున్న గేమ్ ఛేంజర్, డాకూ మహరాజ్, సంక్రాంతికి వస్తున్నాం మూడు పెద్ద సినిమాలపై ఏవిదంగా ఉంటుందో?