
రామ్ చరణ్, కియరా అద్వానీ జంటగా శంకర్ దర్శకత్వంలో జనవరి 10న వస్తున్న ‘గేమ్ ఛేంజర్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ కాకినాడ జిల్లాలో నిర్వహించబోతున్నారు. ఇందుకోసం రామ్ చరణ్ వ్యక్తిగత సిబ్బంది, నిర్వాహకులు మంగళవారం కాకినాడ, పిఠాపురం పరిసర ప్రాంతాలలో మైదానాలను పరిశీలించారు. మెగా ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా వారికి తమ ప్రాంతంలో ఉండే మైదానాలను చూపించారు.
పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు ఆయనకు మద్దతుగా ఎన్నికల ప్రచారానికి వచ్చిన రామ్ చరణ్, తన బాబాయ్‌ని ఎన్నికలలో గెలిపిస్తే గేమ్ ఛేంజర్ పిఠాపురం పరిసర ప్రాంతాలలో నిర్వహిస్తానని అభిమానులకు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నిలబెట్టుకోబోతున్నారు.
గేమ్ ఛేంజర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరుకాబోతున్నారు. ఒకే వేదికపై పవన్ కళ్యాణ్, రామ్ చరణ్‌లు కనిపిస్తే అభిమానులకు పండగే కదా?
గేమ్ ఛేంజర్‌లో అంజలి, ఎస్‌జె.సూర్య, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్, జయరాం తదితరులు ఈ సినిమాలో ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్టోరీ లైన్: కార్తీక్ సుబ్బరాజు, కధ: ఎస్.యు వెంకటేశన్, ఫర్హాద్ సంజీ, వివేక్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్ర, దర్శకత్వం: శంకర్, సంగీతం: థమన్, కెమెరా: ఎస్.తిరునవుక్కరసు, పాటలు: రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, కాసర్ల శ్యామ్, యాక్షన్: ఆన్భైరవ్, కొరియోగ్రఫీ: ప్రభుదేవా, ప్రేమ్ రక్షిత్, గణేశ్ ఆచార్య, బోస్కో మార్షియా, జానీ, శాండీ, ఆర్ట్: అవినాష్ కొల్ల చేస్తున్నారు.
శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు, శిరీశ్ కలిసి పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.