ముఫాసా: ది లయన్ కింగ్

ప్రముఖ హాలీవుడ్ సంస్థ డిస్నీ నిర్మిస్తున్న ముఫాసా: ది లయన్ కింగ్ సినిమా క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్‌ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 

1994లో విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన ‘ది లైన్ కింగ్’ సినిమాకి సీక్వెల్‌గా ఈ సినిమా వస్తోంది. దీనిలో అడవికి రారాజుగా ఉండే ముఫసా (సింహం) పాత్రకు మహేష్‌ బాబు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. ప్రముఖ తెలుగు హాస్య నటులు బ్రహ్మానందం, అలీలతో పాటు సత్యదేవ్, అయ్యప్ప పి శర్మ వివిద పాత్రలకు తెలుగులో డబ్బింగ్ చెప్పారు. 

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. కొద్ది సేపటి క్రితమే తెలుగు వెర్షన్ ట్రైలర్‌ విడుదలైంది. 

దీని హిందీ వెర్షన్‌లో ముఫసా పాత్రకి ప్రముఖ బాలీవుడ్‌ నటుడు షారూక్ ఖాన్, ముఫసా చిన్నప్పటి పాత్రకి ఆయన చిన్న కుమారుడు అబ్రమ్, సింబా పాత్రకు పెద్ద కుమారుడు ఆర్యన్ ఖాన్ డబ్బింగ్ చెప్పారు.

ఈ సినిమాకు దర్శకత్వం: బారీ జెన్‌కీన్స్, స్క్రీన్ ప్లే: జెఫ్ నాధన్‌సన్, బ్యాక్ గ్రౌండ్ సంగీతం: డావ్ మెట్జర్, పాటలకు సంగీతం: లిన్-మాన్యుయెల్ మిరండా, ఎడిటింగ్: జోయి మెక్ మిలన్. 

నిర్మాణ సంస్థ: వాల్ట్ డిస్నీ పిక్చర్స్; డిస్ట్రిబ్యూటర్ సంస్థ: వాల్ట్ డిస్నీ స్టూడియోస్ మోషన్ పిక్చర్స్.