
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా పూర్తి చేయగా, జాన్వీ కపూర్ తన తొలి తెలుగు సినిమా దేవర పూర్తి చేసింది. ఇప్పుడు ఇద్దరూ ఉప్పెన బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కమిట్ అయిన సినిమా చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఈ ఏడాది మార్చి 20వ తేదీన జరిగింది. ఈ శుక్రవారం నుంచే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.
ముందుగా తొలి షెడ్యూల్ మైసూర్‌లో ప్లాన్ చేశారు. కనుక రామ్ చరణ్, జాన్వీ కపూర్ శుక్రవారం మైసూర్ బయలుదేరబోతున్నారు. అయితే తొలి షెడ్యూల్ ఎక్కువ రోజులు ఉండదని తెలుస్తోంది. వారిద్దరిపై రెండు మూడు ముఖ్యమైన సన్నివేశాలు షూటింగ్‌తో తొలి షెడ్యూల్ పూర్తవుతుంది.
ఈ సినిమాకు ఏఆర్. రహమాన్ సంగీతం అందించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట్ సతీష్ కిలారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీ నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు వెలువడే అవకాశం ఉంది.