ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రహమాన్ తన భార్య సైరా భాను నుంచి విడిపోయారు. వారిరువురూ పరస్పర అంగీకారంతోనే విడిపోయారని వారి న్యాయవాది వందనా షా తెలియజేశారు.
వారిరువురూ 29 ఏళ్ళపాటు వైవాహిక జీవితం గడిపారు. ఇద్దరికీ పరస్పరం ప్రేమ, గౌరవం కూడా ఉన్నాయి. కానీ కొన్ని భావోద్వేగపూరితమైన ఒత్తిళ్ళ కారణంగా వారి మద్య కొన్ని సమస్యలు, మనస్పర్ధలు ఏర్పడ్డాయి. కనుక ఇంకా కలిసి ఉంటూ ఇద్దరూ ఇబ్బంది పడటం కంటే పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు,” అని లాయర్ వందనా షా తెలిపారు.
ఏఆర్ రహమాన్, సైరా భానుల వివాహం 1995లో జరిగింది. వారికి ఖతీజా, రహీమా, అమీన్ ముగ్గురు సంతానం. త్వరలో తాము 30వ సంవత్సర పెళ్లి వేడుకలు జరుపుకోవాలని అనుకున్నామని కానీ ఈవిదంగా విడిపోవలసి వస్తుందని అనుకోలేదని ఏఆర్ రహమాన్ ట్వీట్ చేశారు.
“పగిలిన ముక్కలు మళ్ళీ ఆతుక్కోవు. కనుక ఇద్దరం ఎవరికి నచ్చిన్నట్లు వారు సంతోషంగా జీవితాలు గడపాలని నిర్ణయించుకున్నాము. కనుక అభిమానులు, బంధుమిత్రులు అందరూ మా నిర్ణయాన్ని అంగీకరించి, మా వ్యక్తిగత గోప్యతని గౌరవిస్తారని ఆశిస్తున్నాము,” అని ఏఆర్ రహమాన్ ట్వీట్ చేశారు.
“We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for…
— A.R.Rahman (@arrahman) November 19, 2024