
అనసూయ అనగానే గుర్తొచ్చే ప్రోగ్రాం జబర్దస్త్.. బుల్లితెర మీద అందాల విందు ప్రదర్శించిన ఈ అమ్మడు ఆ క్రేజ్ తో సినిమాల్లో కూడా రాణించేస్తుంది. కుదిరితే ఓ రోల్ లేదంటే ఓ సాంగ్ అంటూ ఇమేజ్ ను క్యాష్ చేసుకుంటున్న అనసూయ ఈమధ్యనే స్టార్ట్ చేసిన ఓ ప్రోగ్రాం అర్ధాంతరంగా ఆపేయాల్సి వచ్చింది. అనసూయతో డేట్.. అదేనండి డేట్ విత్ అనసూయ అని ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ వారు ప్రోగ్రాం నడిపారు.
10 ఎపిసోడ్స్ అయ్యాయో లేదో ఆమె డేట్స్ అడ్జెస్ట్ కావట్లేదని ఆ ప్రోగ్రాం ఆపేశారట. నిజానికి ఇదవరకు కన్నా అనసూయ ఇప్పుడు సినిమాల్లో కూడా బిజీ అవ్వడం వల్ల డేట్స్ ఖాళీగా ఉండట్లేదు. అయితే అది ఒక కారణం అయినా ఆ ప్రోగ్రాంకు అనుకున్నంత రేటింగ్ రావడం లేదనే కారణం చేత కూడా అనసూయను కావాలని ఆపించేశారని వార్తలు వస్తున్నాయి. యాంకర్ మార్చే ప్రోగ్రాం కాదు కాబట్టి ఏకంగా ఆ ప్రోగ్రాం కే ఫుల్ స్టాప్ పెట్టేశారట.
అఖిల్ తో స్టార్ట్ చేసిన అనసూయ డేట్ ప్రోగ్రాం ఎన్నో రోజులు సక్సెస్ ఫుల్ గా రన్ అవలేదు. అయితే అలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో అవడం వల్ల ఈ కాన్సెప్ట్ అంత వర్క్ అవుట్ కాలేదని తెలుస్తుంది. రెగ్యులర్ గా ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలే అక్కడ అడగడం ఆడియెన్స్ కు అంత కిక్ అనిపించలేదు.