డిసెంబర్‌ 4న పెళ్ళి పీటలు ఎక్కబోతున్న చైతు-శోభిత

నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్ళి శుభలేఖలు వచ్చేశాయి. డిసెంబర్‌ 4వ తేదీ హైదరాబాద్‌ అన్నపూర్ణ స్టూడియోస్ జరుగబోతోందని శుభలేఖలో పేర్కొన్నారు. పెళ్ళిలో బంధుమిత్రులకు బట్టలు పెట్టడం, ఏదైనా గిఫ్ట్ ఇవ్వడం ఆనవాయితీ.

కనుక శోభిత ధూళిపాళ తల్లి తండ్రులు వేణుగోపాల రావు, శాంత కామాక్షి దంపతులు శుభలేఖతో పాటు ఓ బుట్టలో చీర, పసుపు కుంకుమ, ఓ వెండి వస్తువు పెట్టి బంధుమిత్రులకు అందింస్తూ ఆహ్వానం పలుకుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శుభలేఖలో వివాహ ముహూర్తం ఎన్ని గంటలకు అనేది పేర్కొనలేదు. 

వారి పెళ్ళి కానుకగా నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ‘తండెల్’ సినిమా డిసెంబర్‌ 20న విడుదలవుతుందని భావించినప్పటికీ  ఫిబ్రవరి 7న విడుదల కాబోతోంది. 

ఈ సినిమాకి దర్శకత్వం: చందూ మొండేటి, కధ: కార్తీక్ తీడ, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమెరా: శాందత్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. తండెల్ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్, బన్నీ వ్యాస్ కలిసి నిర్మిస్తున్నారు.