అప్పుడే మహేష్ తో ఛాన్స్..!

సూపర్ స్టార్ మహేష్ తో ఛాన్స్ దక్కించుకోవాలంటే కేవలం టాలెంట్ ఒక్కటే సరిపోదు అదృష్టం కూడా ఉండాలి. మహేష్ తో సినిమా ఓకే అయ్యి చివరి నిమిషంలో ఛాన్స్ మిస్ అయిన భామలు ఎంతమందో. అయితే ప్రస్తుతం ఓ లక్కీ హీరోయిన్ కేవలం తెలుగులో నటించిన ఒక్క సినిమా రిలీజ్ అయ్యి హిట్ అవగా మరో సినిమా షూటింగ్ జరుగుతుంది అలాంటి టైంలో మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. మలయాళం నుండి వచ్చిన అమ్మడి క్యూట్ లుక్స్ కు ఇక్కడ ఆడియెన్స్ మాత్రమే కాదు దర్శక నిర్మాతలు బౌల్డ్ అయ్యారు. అందుకే ఆమెకు వరుస అవకాశాలు ఇస్తున్నారు.

ఇక ఆ లక్కీ భామ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు అనుకుంటా.. నేను శైలజతో ఎంట్రీ ఇచ్చి రామ్ కు మెమరబుల్ హిట్ ఇచ్చిన కీర్తి సురేష్ ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాలు చేసింది. ఇక ప్రస్తుతం తెలుగులో నానితో నేను లోకల్ సినిమాలో నటిస్తున్న ఈ భామ మహేష్ కొరటాల మూవీలో ఛాన్స్ కొట్టేసిందని టాక్. శ్రీమంతుడు తర్వాత క్రేజీ కాంబినేషన్ గా వస్తున్న ఈ మూవీలో కీర్తి ఒక హీరోయిన్ గా నటిస్తుందట. 

మహేష్ చేస్తున్న మురుగదాస్ మూవీ పూర్తి కాగానే ఫిబ్రవరి నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుంది. భరత్ అను నేను టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించబోతున్నాడట.