
ఆదివారం సాయంత్రం 6.03 గంటలకు బిహార్ రాజధాని పాట్నాలో పుష్ప-2 ట్రైలర్ విడుదల కార్యక్రమం జరుగుతోంది. తెలుగు రాష్ట్రాలలో అల్లు అర్జున్ అభిమానులు కూడా ఊహించని స్థాయిలో పాట్నాలో వేలాదిమంది అల్లు అర్జున్ అభిమానులు తరలిరావడంతో మహాత్మాగాంధీ మైదానం కిటకిటలాడుతోంది. లోపల ఇసుక వేస్తే రాలనంతగా జనం నిండిపోవడంతో లైటింగ్, స్పీకర్స్ కోసం ఏర్పాట్లు చేసిన భారీ స్టాండ్స్ పైకి ఎక్కి అందరూ అల్లు అర్జున్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈరోజు సాయంత్రం 5గంటలకు అల్లు అర్జున్, రష్మిక మందన, పుష్ప-2 బృందం పాట్నా చేరుకోగా వారికి అభిమానులు భారీగా స్వాగతం పలికారు. మరికొద్ది సేపటిలో పుష్ప-2 ట్రైలర్ లాంచింగ్ ఈవెంట్ మొదలవుతుంది. పుష్ప-2 అమెరికాలో డిసెంబర్ 4న, భారత్‌లో డిసెంబర్ 5న విడుదల కాబోతోంది.