
పలువురు కన్నడ నటీనటులు దశాబ్ధాలుగా తెలుగు సినిమాలలో నటిస్తూనే ఉన్నారు. కానీ దక్షిణాదిన కన్నడ సినీ పరిశ్రమకి పెద్దగా గుర్తింపు ఉండేది కాదు. కానీ కేజీఎఫ్, ఆ తర్వాత సలార్, కాంతార వంటి సినిమాలతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు కన్నడ సినీ ఇండస్ట్రీ కూడా అనేక పాన్ ఇండియా మూవీలు నిర్మిస్తోంది.
హోంబాలే ఫిలిమ్స్ తాజాగా ‘మహావతార్: నరసింహ’ ప్రకటించగా, రిషబ్ శెట్టి కెరీర్‌ని మలుపు తిప్పిన కాంతార సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న కాంతార చాప్టర్-1 పోస్టర్ ఈరోజు విడుదల చేశారు. ఈ సినిమా 2025, అక్టోబర్ 2వ తేదీన విడుదల చేస్తామని దానిలో తెలియజేశారు.
ఈ సినిమాకి కూడా రిషబ్ శెట్టి కధ అందించి స్వీయ దర్శకత్వంలో ప్రధానపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో జయరాం, జిషు సేన్ గుప్తా ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని కూడా హోంబాలే ఫిలిమ్స్ బ్యానర్‌పై రూ.125 కోట్ల భారీ బడ్జెట్‌తో విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి సంగీతం: బి.అజనీష్ లోకనాధ్, కెమెరా: అర్వింద్ ఎస్.కాశ్యప్, ఎడిటింగ్: కేఎం ప్రకాష్, ప్రతీక్ శెట్టి చేస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ 2023, నవంబర్‌లో ప్రారంభించి 2024లోగా విడుదల చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వలన 2025, అక్టోబర్ 2న విడుదల చేయనున్నారు.
Get ready for India’s biggest prequel! 🔥 #KantaraChapter1 is all set to storm the box office on 𝐎𝐂𝐓𝐎𝐁𝐄𝐑 𝟐, 𝟐𝟎𝟐𝟓. #KantaraChapter1OnOct2 #Kantara @shetty_rishab @hombalefilms @AJANEESHB @KantaraFilm #TeluguFilmNagar pic.twitter.com/tGuCL19bFh
— Telugu FilmNagar (@telugufilmnagar) November 17, 2024